కోరుట్లలో గల్ఫ్ దీక్ష
గల్ఫ్ కార్మికుల సమస్యల సాధన కోసం శనివారం కోరుట్లలో పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉదయం 11 గంటలకు తమ బృందం గల్ఫ్ భరోసా దీక్ష
ప్రెస్ నోట్: 11.08.2023
కోరుట్లలో గల్ఫ్ దీక్ష
గల్ఫ్ కార్మికుల సమస్యల సాధన కోసం శనివారం కోరుట్లలో పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉదయం 11 గంటలకు తమ బృందం గల్ఫ్ భరోసా దీక్ష చేస్తున్నట్లు గల్ఫ్ జెఏసి ప్రతినిధి చల్లగాలి శ్రీను ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు గల్ఫ్ దీక్షకు సంఘీభావం తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గల్ఫ్ కార్మికుల ప్రధాన డిమాండ్లు:
◉ జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత (సోషల్ సెక్యూరిటీ) పథకం ప్రవేశ పెట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి.
◉ ప్రవాసి భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పథకంలో సహజ మరణంను కూడా చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి.
◉ రేషన్ కార్డుల్లో, ఓటరు లిస్టులో గల్ఫ్ కార్మికుల పేర్లు కొనసాగించాలి.
◉ ఎన్నారైలు తమ అమూల్యమైన ఓటు హక్కును ఆన్ లైన్ ద్వారా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలి.
◉ గల్ఫ్ లో ఉన్న సన్నకారు, చిన్నకారు రైతులకు రైతు బీమా వర్తింపజేయాలి.
◉ తక్కువ చదువు, తక్కువ నైపుణ్యం, తక్కువ ఆదాయం కలిగిన గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టాలి.
◉ తెలంగాణ ఏర్పడిన గత తొమ్మిది సంవత్సరాలలో తెలంగాణకు చెందిన 1,800 కి పైగా కార్మికులు గల్ఫ్ దేశాలలో మృతి చెందారు. 2014 కంటే ముందు కూడా వేలాది మంది కార్మికులు గల్ఫ్ దేశాలలో అమరులయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.
◉ గల్ఫ్ కార్మికుల సామాజిక భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్ మరియు ప్రత్యేక నిధితో కూడిన 'గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు' ఏర్పాటు చేయాలి.
ఇట్లు
చల్లగాలి శ్రీను, గల్ఫ్ జెఏసి