Tue Dec 24 2024 02:44:25 GMT+0000 (Coordinated Universal Time)
శాసనమండలి ఛైర్మన్ గా గుత్తా... నేడు ఎన్నిక
శాసనమండలి ఛైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి నేడు ఎన్నిక కానున్నారు. మండలి ఛైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది
శాసనమండలి ఛైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి నేడు ఎన్నిక కానున్నారు. మండలి ఛైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది. టీఆర్ఎస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఛైర్మన్ ఎన్నిక ఉదయం 11 గంటలకు జరగనుంది.
ఏకగ్రీవంగా....
గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం కావడంతో ఆయన రెండోసారి ఈ పదవిని చేపట్టినట్లవుతుంది. నల్లగొండ జిల్లా నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతగా పార్టీలోకి వచ్చిన ఆయన మంత్రి పదవిని ఆశించారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆయనను పెద్దల సభకే పరిమితం చేశారు. ఈరోజు మండలి ఛైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి బాధ్యతలను స్వీకరిస్తారు.
Next Story