Mon Nov 04 2024 18:31:54 GMT+0000 (Coordinated Universal Time)
ఒంటిపూట బడులకు వేళాయె
తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతూ ఉన్నాయి. ఇక మార్చి నెల మొదలైంది
తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతూ ఉన్నాయి. ఇక మార్చి నెల మొదలైంది కాబట్టి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు ఈ వేడిని తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఒంటి పూట బదులు పెట్టాలని విద్యా శాఖ అధికారులు యోచిస్తూ ఉన్నారు. తాజాగా తెలంగాణలో ఒంటి పూట బడులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పగటి పూట ఎండలను దృష్టిలో ఉంచుకుని హాఫ్ డే పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ మేనేజ్మెంట్లతోపాటు అన్ని పాఠశాలల్లో మార్చి 15 నుంచి హాఫ్‌డే పాఠశాలలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం శనివారం కోరింది. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12.30 వరకు క్లాస్ లు నిర్వహించనున్నారు. ఇక ఎస్ఎస్సీ పరీక్షలు జరిగే పాఠశాలల్లో ద్వితీయార్థంలో స్కూల్స్ ను నిర్వహించేవారు. వేసవి సెలవులు ప్రారంభమయ్యే ఏప్రిల్ 23 వరకు హాఫ్ డే స్కూల్స్ ను నిర్వహించనున్నారు.
ఈ ఏడాది ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించనుంది. ఎల్‌నినో పరిస్థితుల కారణంగా ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు మండిపోనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధికంగా వడగాలులు ఉంటాయని.. మార్చి నుంచి మే దాకా సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని ఐఎండీ అధికారులు తెలిపారు. ఎల్‌నినో పరిస్థితులు వేసవికాలం చివరి దాగా కొనసాగనున్నాయి.
Next Story