Sun Dec 22 2024 03:34:52 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : రేపటి నుంచి ఒంటిపూట బడులు
హైదరాబాద్‌తో సహా తెలంగాణ జిల్లాల్లో రేపటి నుంచి ఒంటిపూట పాఠశాలలు ప్రారంభం కానున్నాయి
హైదరాబాద్‌తో సహా తెలంగాణ జిల్లాల్లో రేపటి నుంచి ఒంటిపూట పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరిగిపోతున్న కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజన పథకం మాత్రం యధావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులకు కూడా కొనసాగుతాయి.
అక్కడ మాత్రం...
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రతి రోజూ పాఠశాలలు ఉదయం 8 గంటలకు తరగతులు మొదలై మధ్యాహ్నం 12.30 గంటల వరకూ జరుగుతాయి. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటిగంటనుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదవ తరగతి పరీక్షలు ముగిశాక, అక్కడ కూడా ఒంటిపూట తరగతులు నిర్వహిస్తారని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
Next Story