Tue Dec 24 2024 00:10:16 GMT+0000 (Coordinated Universal Time)
వీహెచ్ ఈ డిమాండ్ ను అయినా కాంగ్రెస్ పెద్దలు పట్టించుకుంటారో.. లేదో!!
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు కాంగ్రెస్ పార్టీ ముందు
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు కాంగ్రెస్ పార్టీ ముందు మరో డిమాండ్ ను ఉంచారు. గత కొన్నేళ్లుగా తనకు ఎలాంటి పదవీ ఇవ్వలేదని.. ఇప్పుడైనా తనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. లోక్ సభ ఎన్నికల్లో తనకు సికింద్రాబాద్ టిక్కెట్ ఇస్తే గెలిచేవాడినన్నారు. టిక్కెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని అన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన దానం నాగేందర్ కు ఎంపీ టికెట్ కేటాయించింది. అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ ఓటమిని ఎదుర్కొంది.
ఇక టీ20 కప్ గెలిచిన టీమిండియాకు వీహెచ్ శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ సిరాజ్కు ఇంటి స్థలం, ఉద్యోగం ఇస్తామని ప్రకటించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని.. రాష్ట్రంలో హైదరాబాద్లో తప్ప ఎక్కడా క్రికెట్ స్టేడియం లేదన్నారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో స్టేడియం నిర్మాణానికి పన్నెండు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు.
Next Story