Sat Dec 21 2024 00:04:12 GMT+0000 (Coordinated Universal Time)
BRS : నాగం కోసం కారు పార్టీ నేతలు
సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డిని పార్టీలోకి రప్పించేందుకు హరీశ్‌రావు, కేటీఆర్‌లు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు
కాంగ్రెస్ లో ఎవరు అసంతృప్తిగా కనిపించినా సరే వెంటనే బీఆర్ఎస్ నేతలు అక్కడికి వెళ్లి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ రెండు విడతలుగా వంద మంది అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో సహజంగా పార్టీలో అసమ్మతులు తలెత్తుతాయి. అయితే ఈ అసమ్మతిని తమకు ప్లస్ గా మార్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. అగ్రనేతలు రంగంలోకి దిగి మరీ వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కండువాలు కప్పేందుకు రెడీ ఉన్నామని, అధికారంలోకి వస్తే పదవులు ఇస్తామని హామీ ఇస్తున్నారు.
బీఆర్ఎస్ లో చేరాలని...
అందులో భాగంగానే సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డిని పార్టీలోకి రప్పించేందుకు హరీశ్‌రావు, కేటీఆర్‌లు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. పార్టీలో చేరాలంటూ ఆయనను ఆహ్వానించారు. అయితే నాగం జనార్థన్ రెడ్డి మాత్రం తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. పార్టీలోకి రావాలంటూ స్వయంగా కేటీఆర్ ఆహ్వానించడంతో నాగం వెళ్లే అవకాశాలున్నాయి. వాటిని కొట్టిపారేయడానికి వీలులేదు. నాగర్ కర్నూలు టిక్కెట్ ను ఆశించిన నాగం జనార్థన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈరాత్రికి కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరే అవకాశాలున్నాయి.
Next Story