Fri Nov 22 2024 21:06:55 GMT+0000 (Coordinated Universal Time)
Harish Rao : సీఎంపై సభా హక్కుల నోటీసు ఇస్తున్నాం
సీఎం రేవంత్ రెడ్డి ,సత్య దూరమైన అంశాలను లేవనెత్తుతూ సభను పక్క దారి పట్టిస్తున్నారని హరీశ్ రావు అన్నారు
పాలక పక్షం ఆత్మరక్షణ లో పడినప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డి ,సత్య దూరమైన అంశాలను లేవనెత్తుతూ సభను పక్క దారి పట్టిస్తున్నారని హరీశ్ రావు అన్నారు. ప్రతి సమవేశం లోనూ ఇదే జరుగుతోందన్నారు. ఆయన అసెంబ్లీ హాలులో మీడియాతో చిట్ చాట్ చేశారు. సభా నాయకుడు ఆదర్శంగా ఉండాల్సింది పొయి సభలో అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. గత సమావేశాల్లో మేడి గడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యం కాదని రిటైర్డ్ ఇంజినీర్లు నివేదిక ఇచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదని అబద్ధమాడారన్నారు. రిటైర్డ్ ఇంజినీర్ల వాదన వేరే లాగా ఉంటే సీఎం మరోలా చెప్పి సభ ను తప్పు దోవ పట్టించారన్నారు. నిన్నటి సమావేశం లో విద్యుత్ మీటర్ల పై కూడా తప్పుడు పత్రం తో సీఎం సభను తప్పు దోవ పట్టించారని, తనకు కావాల్సిన వాక్యం చదివి మిగతా పదాలు వదిలేశాలన్నారు. ఈ అంశం పై మేము ఇప్పటికే వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు.
అబద్దాలు.. అసత్యాలు...
ముఖ్యమంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం కూడా ఇస్తామన్న హరీశ్ రావు తాను వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేసీఆర్ ఒప్పుకోలేదని అంటే ఆ సందర్భంలో ఉదయ్ స్కీం ఒప్పందం చదివి వ్యవసాయ మీటర్లకు ఒప్పుకున్నట్టు భ్రమింప జేశారన్నారు. పోతిరెడ్డి పాడు పై వై ఎస్ హాయం లో తాము పదవుల కోసం పెదవులు మూసుకున్నామని రేవంత్ తమపై ఆరోపణలు చేశారన్నారు. పోతిరెడ్డి పాడు పై జీ ఓ రాకముందే తాము వై ఎస్ కేబినెట్ నుంచి వైదొలిగామని, తాము రాజీనామా చేయడానికి పోతిరెడ్డి పాడు సహా అనేక అంశాలు కారణమని ఆయన తెలిపారు. పదవుల కోసం పెదవులు మూసుకున్నది రేవంత్ రెడ్డి అని తానేదో తెలంగాణ ఛాంపియన్ అయినట్టు రేవంత్ మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రకటన వెనక్కి పోతే మేము రాజీనామా చేశామని, రేవంత్ రెడ్డి కనీసం డూప్లికేట్ రాజీనామా కూడా చేయలేదని గుర్తు చేశారు.
Next Story