ఆయనే నా ఫెవరెట్ హీరో....!!
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి... ప్రస్తుతం ఈయన ఢిల్లీ పర్యటన లో ఉన్నారు..
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి... ప్రస్తుతం ఈయన ఢిల్లీ పర్యటన లో ఉన్నారు..అందులో భాగంగా రాష్ట్రానికి కావలసిన నిధుల సేకరణ కోసం, పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల గురించి కేంద్రమంత్రులతో బిజీగా చర్చిస్తున్నారు...పర్యటనలో భాగంగా ఆయన ఓ నేషనల్ మీడియాకి ఓ ఇంటర్వ్యూ ఇస్తూ....ఆ ఇంటర్వ్యూలో యాంకర్ కి రేవంత్ రెడ్డి కి మధ్య ఓ వివాదం పై చర్చ నడుస్తోంది...!! ఆ చర్ఛలో భాగంగా మీ ఫెవరెట్ హీరో ఎవరు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా...."" నా ఫెవరెట్ హీరో కృష్ణ,కానీ ఆయన ఇప్పుడు లేరు "" అని రేవంత్ రెడ్డి బదులు ఇచ్చారు..
వారిద్దరి మధ్య జరిగిన చర్ఛ ఏంటంటే... దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన పుష్పా -2 హీరో అల్లు అర్జున్ ని అరెస్టు చేయడం గురించి...!!
యాంకర్ దీనిగురించి మాట్లాడుతూ.... మీరు అల్లు అర్జున్ అరెస్టు చేయడం మీకు తెలిసే జరిగింది అని... అడగ్గా.... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "" అల్లు అర్జున్ ని అరెస్టు చేయడం పోలీసులకు సంబంధించిన అంశం...లా అండ్ ఆర్డర్ విషయంలో పోలిసులు తగిన విధంగా ఏం చేయాలో వారు నిర్ణయించుకుంటారు.... "" అని ఆయన సమాధానం ఇచ్చారు..!!!