Sun Dec 22 2024 22:31:08 GMT+0000 (Coordinated Universal Time)
హెల్త్ ప్రొఫైల్ సర్వేని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన హెల్త్ ప్రొఫైల్ లో భాగంగా రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారందరి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి,
ములుగు : తెలంగాణ ప్రభుత్వం హెల్త్ ప్రొఫైల్ సర్వేని ప్రారంభించింది. ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ములుగు జిల్లా ఏరియా ఆస్పత్రి నుంచి హెల్త్ ప్రొఫైల్ సర్వే లాంఛనంగా మొదలైంది. అనంతరం మంత్రి హరీష్ రావు జిల్లా ఆసుపత్రి, రూ.31 లక్షలతో పీడియాట్రిక్ విభాగం, రూ.60 లక్షలతో నిర్మించనున్న రేడియాలజీ ల్యాబ్ కు ఆయన శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులకు డిజిటల్ హెల్త్ కార్డులను అందజేశారు.
హెల్త్ ప్రొఫైల్ సర్వే లో ఏం చేస్తారు ?
తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన హెల్త్ ప్రొఫైల్ లో భాగంగా రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారందరి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి, ఒక నివేదికను తయారు చేస్తారు. సర్వే అనంతరం వారికి డిజిటల్ హెల్త్ కార్డులను పంపిణీ చేస్తారు. రాష్ట్రంలో వైద్య సేవలను మరింత విస్తరింపజేసేందుకు ఈ సర్వేను చేపట్టినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ములుగు జిల్లాలో 40 రోజుల్లో సర్వే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ సర్వేలో మొత్తం 197 బృందాలు పనిచేస్తాయని, హెల్త్ ప్రొఫైల్ సర్వే కోసం రూ.10 కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ సర్వే ద్వారా సేకరించిన వివరాలు.. అత్యవసర చికిత్స సమయంలో ఉపయోగపడుతాయని మంత్రి హరీష్ రావు వివరించారు.
Next Story