Mon Dec 15 2025 06:27:54 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు కేసీఆర్ పిటీషన్ పై సుప్రీంలో విచారణ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలపై నియమించిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఛత్తీస్గఢ్ తో విద్యుత్తు కొనుగోలుతో పాటు, యాదాద్రి, భద్రాద్రి ధర్మల్ విద్యుత్తు నిర్మాణంలో అవకతవకలకు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ను నియమించిన సంగతి తెలిసిందే.
రద్దు చేయాలని...
జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఈ మేరకు విచారణను ప్రారంభించింది. కేసీఆర్ కు కూడా హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తనను విచారణకు పిలవడంపై ఆయన హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈరోజు ఈ పిటీషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటీషన్ విచారణ చేయనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Next Story

