Sat Nov 23 2024 02:08:25 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కవిత బెయిల్ పై తీర్పు రిజర్వ్.. తీర్పు ఎప్పుడంటే
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. రెగ్యులర్ బెయిల్ పిటీషన్ పై న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మే 2వ తేదీన తీర్పును ప్రకటించనుంది. . ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో పాటు సీబీఐ కూడా కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఉన్నారు. మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు ఈ కేసులో అరెస్ట్ చేశారు.
తీహార్ జైలులో...
ఈడీ పది రోజులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేసిన అనంతరం మార్చి 26వ తేదీన కవితను తీహార్ జైలుకు తరలించారు. ఈడీ, సీబీఐ ఇప్పటికే తమ కస్టడీలోకి తీసుకుని కవితను విచారణ జరిపింది. నేడు కవిత బెయిల్ పిటీషన్ పై విచారణ జరగనుంది. సీబీఐ, ఈడీ కేసుల్లో వేర్వేరుగా వేసిన పిటీషన్లపై మే రెండో తేదీన వచ్చే తీర్పు పై ఉత్కంఠ నెలకొంది.
Next Story