Fri Apr 25 2025 02:35:00 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntal Kavitha : నేడు కవిత బెయిల్ పిటీషన్ పై విచారణ
నేడు కవిత బెయిల్ పిటీషన్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది.

నేడు కవిత బెయిల్ పిటీషన్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. నిన్న సీబీఐ కేసులో బెయిల్ పై విచారణ జరిగింది. విచారణలో ఇరువర్గాల వాదన విన్న న్యాయమూర్తి తీర్పును మే 2వ తేదీకి రిజర్వ్ చేశారు. నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో కవిత బెయిల్ పిటీషన్ పై న్యాయమూర్తి విచారించనున్నారు.
మార్చి 15న అరెస్ట్...
గత నెల 15వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ప్రమేయం ఉందని ఈడీ తరుపున న్యాయవాదులు గట్టిగా వాదిస్తున్నారు. కవిత సౌత్ లాబీ నుంచి వంద కోట్ల రూపాయల ముడుపులను సేకరించి ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేశారు. కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.
Next Story