Sun Dec 22 2024 19:34:06 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత భవిష్యత్ తేలనుందా? బెయిల్ వస్తుందా? రాదా?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంటల కవిత బెయిల్ పిటీషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంటల కవిత బెయిల్ పిటీషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ, సీబీఐ దాఖలు చేసిన కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బెయిల్ రావడంతో కల్వకుంట్ల కవిత కూడా తనకు బెయిల్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఈరోజు సుప్రీంకోర్టులో జరిగే కవిత పిటీషన్ పై జస్టిస్ విశ్వనాధ్, జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం విచారించనుంది.
ఐదు నెలల నుంచి...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ ఏడాది మార్చి 15 వతేదీన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లో ఉన్న కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమెను కోర్టు అనుమతితో విచారణ చేసిన తర్వాత తీహార్ జైలుకు తరలించారు. అయితే ఇదే కేసులో కవితను సీబీఐ కూడా విచారించి కేసు నమోదు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ప్రమేయం ఉందని, సౌత్ లాబీయింగ్ నుంచి కోట్లాది రూపాయలను సేకరించి ఆమ్ ఆద్మీపార్టీ అగ్రనేతలకు అందచేశారన్నది ప్రధాన అభియోగం. కవిత అరెస్టయి ఐదు నెలలు కావస్తుంది.
ఇరువర్గాల వాదనలు...
ిఇదే కేసులో కల్వకుంట్ల కవిత కూడా ఆర్థికంగా లబ్దిపొందారని సీబీఐ, ఈడీలు ఆరోపించాయి. ఛార్జిషీట్లో కూడా అదే విషయాలను ప్రస్తావించాయి. అయితే ఈ కేసులో ట్రయల్ కోర్టు, హైకోర్టు బెయిల్ ఇప్పటికే నిరాకరించింది. కానీ కల్వకుంట్ల కవిత ఆరోగ్యం జైలులో పూర్తిగా దెబ్బతినిందని, పదకొండు కిలోల బరువు తగ్గారని కూడా ఆమె తరుపున న్యాయవాదులు వాదిస్తున్నారు. కానీ కల్వకుంట్ల కవితకు బెయిల ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ, ఈడీ తరుపున న్యాయవాదులు అంటున్నారు. మొత్తం మీద కల్వకుంట్ల కవిత తీహార్ జైలు నుంచి కవిత బయటకు వస్తారా? రారా? అన్నది నేడు తేలనుంది.
Next Story