Fri Dec 27 2024 19:57:15 GMT+0000 (Coordinated Universal Time)
kalvakuntla kavitha : బెయిల్ పై విచారణ పూర్తి.. తీర్పు రిజర్వ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. అయితే తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. మే ఆరో తేదీన తీర్పు వెల్లడిస్తామని తెలిపింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన కేసులో కవిత తరుపున న్యాయవాదులు బెయిల్ పిటీషన్ వేశారు. నిన్న ప్రారంభమయిన విచారణ నేడు కూడా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.
ఈ కేసులో కూడా....
నిన్న కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో మరో పథ్నాలుగు రోజులు పొడిగిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15వ తేదీన కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అయితే ఈడీ తర్వాత సీబీఐ కూడా కవితను ఇదే కేసులో అరెస్ట్ చేసింది. సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటీషన్ పై విచారించిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మే 2వ తేదీన తీర్పు వెలువడనుంది. ఈ కేసులో కూడా తీర్పు రిజర్వ్ చేసింది. మే ఆరో తేదీన తీర్పువెల్లడించనుంది
Next Story