Sun Jan 12 2025 02:01:29 GMT+0000 (Coordinated Universal Time)
తీవ్రమైన చర్యలకు దిగొద్దు.. హైకోర్టు ఉత్తర్వులు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యుత్ బకాయీల వివాదంపై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యుత్ బకాయీల వివాదంపై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఏపీ విద్యుత్తు సంస్థలకు ఏడువేల కోట్ల రూపాయలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన హైకోర్టు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయీల వివాదంపై తీవ్రమైన చర్యలకు దిగవద్దని ఆదేశించింది.
వాదనలు వినకుండా...
ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తమ వాదనలను వినకుండా ఆంధ్రప్రదేశ్ కు విద్యుత్తు బకాయీలు చెల్లించాలని ఆదేశాలు ఇవ్వడాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పు పట్టింది. ఇది సమంజసం కాదని అభిప్రాయపడింది. పూర్తి వివరాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యుత్ సంస్థలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 18వ తేదీకి వాయిదా వేసింది.
Next Story