Mon Dec 23 2024 03:41:23 GMT+0000 (Coordinated Universal Time)
హార్ట్ బ్రేకింగ్.. తల్లి అంత్యక్రియల కోసం చిన్నారి బిక్షాటన
తల్లి అంత్య క్రియలకు డబ్బులు లేక ఓ చిన్నారి భిక్షాటన చేసిన హృదయ విదారక ఘటన నిర్మల్ లో లోజరిగింది.
తల్లి అంత్య క్రియలకు డబ్బులు లేక ఓ చిన్నారి భిక్షాటన చేసిన హృదయ విదారక ఘటన నిర్మల్ లో లోజరిగింది. తానూర్(మ) బెల్తరో డాకు చెందిన గంగామణి భర్తకు దూరంగా ఉంటూ కూతురు దుర్గను పోషిస్తోంది. కొన్నిరోజుల క్రితం భర్తమృతిచెందాడు. మనస్తాపంతోనూ ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో తల్లి గంగామణి ఆత్మాహుతికి పాల్పడింది.
అనాధగా మారి...
అయితే చిన్నారి కుటుంబంలో ఒంటరిగా మిగిలిపోయింది. చివరకు తన తల్లి మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేకపోవడంతో ఆ చిన్నారి బిక్షాటన చేసింది. తల్లిఅంత్య క్రియలకు డబ్బులు లేని దుస్థితిలో సాయంచేయాలన్న చిన్నారి విజ్ఞప్తికి గ్రామస్థులు తోచినంతగా సాయం చేశారు. అనాధగా మిగిలిపోయిన ఆ చిన్నారిని ఆదుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Next Story