Sun Apr 20 2025 14:12:56 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణలో భారీ వర్షం.. వడగళ్ల వాన
తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం పడుతుంది. ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి

తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం పడుతుంది. ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. మంచిర్యాల, కొరుముం భీం , జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. మంచిర్యాల మండలంలోని లక్సెట్టిపేట మండలంలో వర్షం తో పాటు ఈదురుగాలులు వీచాయి. దీంతో షాపుల పైకప్పులు ఎగిరిపోయాయి. వృక్షలు నేలకొరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
వడగళ్ల వాన కూడా...
లక్సెట్టిపేట మండలంలో వడగళ్ల వాన కూడా పడింది. కాగజ్ నగర్ లోనూ అనేక దుకాణాల పైకప్పులు ఎగిరిపోయాయి. 150 సంవత్సరాల చరిత్ర ఉన్న పోచమ్మ చెట్టు కూలిపోవడంతో వాహనాలను ఆ మార్గం నుంచి వెళ్లకుండా దారి మళ్లిస్తున్నారు. ఎండలు ముదుతున్న సమయంలో అకాల వర్షంతో ప్రజలు ఊరట చెందినా ట్రాఫిక్ సమస్య తలెత్తి ఇబ్బంది పడుతున్నారు.
Next Story