Fri Nov 22 2024 20:21:37 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో భారీ వర్షం.. సీతాఫల్ మండిలో 7.2సె.మీ వర్షపాతం
అత్యధికంగా సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండి లో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. బంసిలాల్ పేట్ లో 6.7 సెంటీమీటర్లు..
హైదరాబాద్ : తెలంగాణలో వాతావరణం చల్లబడింది. బుధవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండటంతో నగర వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అబ్దుల్లాపూర్మెట్, పెద్ద అంబర్ పేట్, తుర్కయాంజల్, హయత్ నగర్, వనస్థలిపురం, చైతన్యపురి, నాగోల్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, కొత్తపేట, సరూర్ నగర్, చంపాపేట, సైదాబాద్, బేగంపేట్, అల్వాల్, తిరుమలగిరి, బోయిన్పల్లి, చిలకలగూడ, మారేడ్పల్లి, సికింద్రాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండటంతో.. ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది.
అత్యధికంగా సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండి లో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. బంసిలాల్ పేట్ లో 6.7 సెంటీమీటర్లు, వెస్ట్ మారేడ్ పల్లిలో లో 6.1 సెంటీమీటర్లు, అల్వాల్లో 5.9 సెంటీమీటర్లు, ఎల్బీ నగర్ లో 5.8 సెంటీమీటర్లు, గోషామహల్ బాలానగర్ లో 5.4 సెంటీమీటర్లు, ఏఎస్ రావు నగర్ లో 5.1 సెంటిమీటర్లు, బేగంపేటలోని పాటిగడ్డ లో 4.9 సెంటీమీటర్లు, మల్కాజ్గిరిలో 4.7 సెంటీమీటర్లు, సరూర్ నగర్ ఫలక్నామా లో 4.6 సెంటి మీటర్లు, గన్ ఫౌండ్రీ లో 4.4 సెంటీమీటర్లు, కాచిగూడ , సికింద్రాబాద్ లో 4.3 సెంటీమీటర్లు, చార్మినార్ లో 4.2 సెంటీమీటర్లు, గుడిమల్కాపూర్ నాచారం లో 4.1 సెంటి మీటర్లు, అంబర్పేట్ లో 4 సెంటీమీటర్లు, అమీర్ పేట్, సంతోష్ నగర్ లో 3.7 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ లో 3.6 సెంటీమీటర్లు బేగంబజార్ ,హయత్ నగర్ చిలకనగర్ లో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావారణ కేంద్రం వెల్లడించింది.
కాగా.. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట ప్రాంతాల్లో కరెంట్ సేవలు నిలిచిపోయాయి. పంజాగుట్ట జంక్షన్ వద్ద నీరు భారీగా స్తంభించిపోయి ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా వర్షాలు కురుస్తున్నాయని, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
Next Story