Sun Dec 22 2024 11:15:40 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నల్లగొండ జిల్లాలో భారీ వర్షం... దీపావళికి ముందు రోజు
నల్లగొండ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో వీధులన్నీ జలమయి మయ్యాయి.
నల్లగొండ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో వీధులన్నీ జలమయి మయ్యాయి. కుండపోత వర్షం కురియడంతో నల్లగొండ పట్టణ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దీపావళి పండగకు ముందు రోజు భారీ వర్షం కురియడంతో ఇంట్లో అందంగా తయారు చేసుకున్న అలంకరణలు కూడా వర్షానికి తడిసి ముద్దయిపోయాయి.
వీధులన్నీ జలమయం...
వీథులన్నీ జలమయం కావడంతో పాటు రోడ్ల పై వరద నీరు పొంగి ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దీపావళి టపాసుల దుకాణాల యజమానులు కూడా భారీ వర్షానికి సరుకు తడిసిపోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అయినా కొంత సరుకు నడిచి నష్టపోయారు. ఇటు వికారాబాద్ జిల్లాలోనూ భారీ వర్షం నమోదయింది.
Next Story