Mon Dec 23 2024 17:57:49 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణకు నేడు కూడా భారీ వర్ష సూచన... ఎల్లో అలెర్ట్
తెలంగాణలో వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. నేడు కూడా భారీ వర్ష సూచనను వాతావరణ శాఖ జారీ చేసింది
తెలంగాణలో వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. నేడు కూడా భారీ వర్ష సూచనను వాతావరణ శాఖ జారీ చేసింది. తెలంగాణలోని పదకొండు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. 21 జిల్లాలలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, భువనగిరి జిల్లాలలో నేడు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
రానున్న మూడు గంటల్లో...
రానున్న మూడు గంటల్లో అనేక చోట్ల మోస్తరు వానలు పడే అవకాశముందని తెలిపింది. హైదరాబాద్ లో నేడు కూడా భారీ వర్షం నమోదవుతుందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో నగర ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయింది. దీంతో కుండపోత వర్షం నమోదవుతుందని అధికారులు తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే వారం రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. దీంతో వర్షం అంటేనే విసిగిపోయి ఉన్నారు. మ్యాన్‌హోల్స్ మూతలు తెరవద్దని, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు గుంతలు చూసుకుని ప్రయాణించాలని, లేకుంటే ప్రమాదానికి గురవుతారని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
Next Story