Sun Dec 22 2024 02:12:08 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : మా అమ్మను చూడనివ్వండి.. కవిత కుమారుల అభ్యర్థన
తమ తల్లి కల్వకుంట్ల కవితను కలిసేందుకు అనుమతించాలని ఆమె కుమారులు రౌస్ అవెన్యూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు
తమ తల్లి కల్వకుంట్ల కవితను కలిసేందుకు అనుమతించాలని ఆమె కుమారులు రౌస్ అవెన్యూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కవిత కుటుంబీకులు కలిసేందుకు ఇప్పటికే అనుమతిచ్చిన కోర్టు కుటుంబంలో ఎక్కువ మందిని అనుమతించడం లేదు. కవిత తల్లి శోభతో పాటు ఆమె కుమారులను కూడా కలిసేందుకు కోర్టు అనుమతించింది.
అరెస్టయిన....
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో ఉన్న కవితను అధికారులు విచారిస్తున్నారు. ఈ నెల 23వ తేదీ వరకూ విచారించడానికి న్యాయస్థానం అనుమతించింది. అయితే కవిత కుమారులు ఆదిత్య, ఆర్యతో పాటు తల్లి శోభను కూడా కలిసేందుకు కోర్టు అనుమతించింది. రేపు నలుగురు కుటుంబ సభ్యులు కలవడానికి కోర్టు అనుమతించింది. ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకూ విచారణ ఉంటుంది. ఆరు గంటల నుంచి గంటసేపు కుటుంబ సభ్యులు కానీ, న్యాయవాదులు కానీ కవితను కలిసే వీలు కల్పించింది.
Next Story