Sun Dec 22 2024 22:45:53 GMT+0000 (Coordinated Universal Time)
వరంగల్ బీజేపీ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
వరంగల్ లో బీజేపీ సభకు హైకోర్టు అనుమతించింది. రేపు జరగబోయే సభను నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది.
వరంగల్ లో బీజేపీ సభకు హైకోర్టు అనుమతించింది. రేపు జరగబోయే సభను నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. దీంతో భారతీయ జనతా పార్టీ కి హైకోర్టులో ఊరట లభించినట్లయింది. రేపు హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో బండి సంజయ్ ప్రజా సంగ్రామయ పాదయాత్ర ముగింపు సభ జరగనుంది. ఈ సభకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో భారతీయ జనతా పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.
తొలిసారి తెలంగాణకు...
దీనిపై విచారించిన హైకోర్టు వరంగల్ సభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. తొలిసారి తెలంగాణకు జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ కూడా రానున్నారు. ఆయన ఈరోజే వరంగంల్ వెళ్లి సభ ఏర్పాట్లను పరిశీలిస్తారు. వరంగల్ సభకు హైకోర్టు అనుమతి మంజూరు చేయడంతో బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. సభకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
Next Story