Sat Jan 11 2025 20:06:01 GMT+0000 (Coordinated Universal Time)
బీఎల్ సంతోష్ కు ఊరట
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి బీజేపీ నేత బీఎల్ సంతోష్ పై హైకోర్టు స్టే పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి బీజేపీ నేత బీఎల్ సంతోష్ పై హైకోర్టు స్టే పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 13వ తేదీ వరకూ హైకోర్టు స్టే పొడిగించింది. విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ఇచ్చిన నోటీసులపై ఈ నెల 13వ వరకూ స్టే పొడిగించినట్లయింది. అప్పటి వరకూ బీఎల్ సంతోష్ అరెస్ట్ చేయడానికి వీలులేదని పేర్కొంది.
స్టే పొడిగిస్తూ...
అలాగే జగ్గుస్వామికి సంబంధించిన నోటీసులపై కూడా స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకూ హైకోర్టు ఆదేశించింది. అలాగే బీఎల్ సంతోష్, జగ్గుస్వామిలు సిట్ ఎదుట హాజరై విచారణకు సహకరించాల్సి ఉంటుందని కూడా హైకోర్టు అభిప్రాయపడింది.
Next Story