Tue Nov 19 2024 14:51:19 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణ ఉద్యోగులకు హైకోర్టు షాక్
తెలంగాణలో ఉద్యోగులకు హైకోర్టు షాక్ ఇచ్చింది.కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేసింది
తెలంగాణలో ఉద్యోగులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 16ను హైకోర్టు కొట్టివేసింది. డిగ్రీ, జూనియర్ కళాశాలల్లోనూ, పాలిటెక్నిక్ కళాశాలల్లోనూ లెక్చరర్లను గత ప్రభుత్వం క్రమబద్దీకరించింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించారని,ప్రభుత్వ నిర్ణయాన్నినిరుద్యోగులు హైకోర్టులో సవాల్ చేశారు.
జీవో నెంబరు 16ని...
దీనిపై విచారించిన హైకోర్టు గత ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని మొత్తం నలభై విభాగాల్లో 5,544 కాంట్రాక్టు ఉద్యోగులను గత ప్రభుత్వం శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్దీకరిస్తూ జీవో జారీ చేసింది. అయితే దీనిపై నిరుద్యోగులు సవాల్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ క్రమబద్దీకరణ జరిగిందని నిరుద్యోగుల తరుపున న్యాయవాదులు వాదించారు. వారి వాదనతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం జీవో నెంబరు 16ను కొట్టి వేసింది. దీంతో దాదాపు ఐదు వేల మంది ఉద్యోగుల భవిష్యత్ మళ్లీ తాత్కాలికమయిపోయింది. అయితే దీనిపై వారు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయని లెక్చరర్ల తరుపున న్యాయవాదులు తెలిపారు
Next Story