Mon Dec 23 2024 14:56:46 GMT+0000 (Coordinated Universal Time)
కోవిడ్ పై తెలంగాణ సర్కార్ కు హైకోర్టు ఆదేశాలు
కోవిడ్ పై ఆంక్షలను విధించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
కోవిడ్ పై ఆంక్షలను విధించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలను కఠినతరం చేయాలని హైకోర్టు పేర్కంది. మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాల మాదిరిగానే ఆంక్షలు విధించాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. రెండు మూడురోజుల్లోనే ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
న్యూ ఇయర్ వేడుకలు.....
ఎయిర్ పోర్టుల్లో మాదిరిగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు సూచించింది. అంతేకాకుండా క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలను విధించాలని తెలిపింది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉదాసీనంగా వ్యవహరించడానికి వీలు లేదని హైకోర్టు అభిప్రాయపడింది.
Next Story