Mon Nov 18 2024 13:50:34 GMT+0000 (Coordinated Universal Time)
ఒమిక్రాన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణలో ఒమిక్రాన్, కరోనా వైరస్ తీవ్రత పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో ఒమిక్రాన్, కరోనా వైరస్ తీవ్రత పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పరీక్షలు సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒమిక్రాన్ చిన్న పిల్లల్లో కూడా వ్యాప్తి చెందుతున్నందున నీలోఫర్ మాత్రమే కాకుండా అదనంగా మరికొన్ని ఆసుపత్రుల్లో పిల్లలకు ప్రత్యేక వైద్య సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని కోరింది.
కోవిడ్ నిబంధనలను....
సామూహిక సమావేశాలపై నిషేధం విధించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పార్టీలు, మతాలు, కులాలకు అతీతంగా నిషేధంపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. సినిమాహాళ్లు, మాల్స్ లో కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలయ్యే చూడాలని ఆదేశించింది. వారాంతంలో జరిగే సంతల్లో కూడా కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17 వతేదీకి వాయిదా వేసింది.
Next Story