Fri Dec 27 2024 13:22:08 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు మరోసారి అనుమతిచ్చింది
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు మరోసారి అనుమతిచ్చింది. అయితే పాదయాత్రకు అనుమతిస్తూ కొన్ని షరతులు విధించింది. ముఖ్యమంత్రి కేసీఆర్, రాజకీయ, మతపరమైన అంశాలను రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని చెప్పింది. పాదయాత్ర కోసం తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అలాగే పోలీసులు కూడా పాదయాత్రకు అనుమతివ్వాలని ఆదేశించింది. ఉద్రిక్తతల కారణంగా వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్ర నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
ఎలా నిరాకరిస్తారు?
తన పాదయాత్రకు పోలీసులు అనుమతివ్వకపోవడంతో మరోసారి హైకోర్టును వైఎస్ షర్మిల ఆశ్రయించారు. ఒకసారి అనుమతిచ్చాక పోలీసులు ఎలా నిరాకరిస్తారని ప్రశ్నించింది. పాదయాత్రల అనుమతి కోసం రాజకీయనేతలందరూ న్యాయస్థానల చుట్టూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించింది. రాజకీయ నేతలకన్నాక ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమని అభిప్రాయపడింది. గతంలో ఉన్న షరతుల మేరకే పాదయాత్రను కొనసాగించాలని షర్మిలను ఆదేశించింది.
Next Story