Fri Dec 20 2024 18:58:30 GMT+0000 (Coordinated Universal Time)
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై స్టే
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై హైకోర్టు స్టే ఇచ్చింది. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టవద్దని తెలిపింది.
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై హైకోర్టు స్టే ఇచ్చింది. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టవద్దని తెలిపింది. కృష్ణుడి విగ్రహాన్నైనా పెట్టండి లేదా ఎన్టీఆర్ విగ్రహాన్ని అయినా పెట్టలని అంతే తప్ప కృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహం పెట్టవద్దని మాత్రం ఆదేశించింది. దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విగ్రహావిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా నిర్వాహకులు ఆహ్వానించారు.
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు...
ఈ నెల 25వ తేదీన ఖమ్మం జిల్లాలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం కృష్ణుడి రూపంలో ఉండటంతో యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వారే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారించిన హైకోర్టు ఇరువర్గాల వాదనలను విన్న తర్వాత హైకోర్టు స్టే ఇచ్చింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
Next Story