Thu Dec 19 2024 03:59:14 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కీలక తీర్పు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ కేసును సీబీఐకి ఇవ్వాలన్న పిటీషన్లపై విచారించిన హైకోర్టు తీర్పును వెలువరించనుంది. ఇప్పటికే హైకోర్టులో ఇరువర్గాల వాదనలు ముగిశాయి. బీజేపీ నేతలు ఈ కేసును సీబీఐ చేత విచారించాలని కోరుతుండగా, ప్రభుత్వం మాత్రం ప్రత్యేక దర్యాప్తు సంస్థ చేత ఇప్పటికే విచారణకు ఆదేశించామని తెలిపింది. కేసు ప్రాధమిక దశలోనే ఉంది కాబట్టి సీబీఐకి అప్పగించాలని పిటీషన్ దారులు వాదించారు. దీనిపై ఎలాంటి తీర్పు వెలువడనుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
ఈడీ విచారణ...
ఇదే కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ ను నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించనుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చంచల్గూడ జైలులో ఉణ్న నందకుమార్ ను రెండు రోజుల పాటు విచారించేందుకు ఈడీ సిద్ధమయింది. నేడు, రేపు నందకుమార్ స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఈ మేరకు న్యాయస్థానం కూడా అనుమతి ఇచ్చింది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఈడీ నందకుమార్ ను విచారించనుంది.
Next Story