Sat Nov 23 2024 01:44:30 GMT+0000 (Coordinated Universal Time)
మంచిర్యాలలో రైళ్లకు తప్పిన పెనుప్రమాదం
తాజాగా మంచిర్యాల జిల్లాలో మరో పెనుప్రమాదం తప్పింది. భారీ ఈదురుగాలులకు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగి పట్టాల మీద పడ్డాయి
ఒడిశాలో జూన్2వ తేదీన జరిగిన రైళ్లప్రమాద ఘటన ఇంకా మరువక ముందే.. మరికొన్ని ప్రమాదాలు వెలుగుచూస్తున్నాయి. ఆ ఘటన జరిగిన ఐదురోజులకే ఒడిశాలోనే భారీ ఈదురుగాలులకు ఇంజన్ లేని గూడ్స్ బండి కదలడంతో.. దానికింద తడవకుండా ఉండేందుకు వెళ్లిన ఆరుగురు కూలీలు దుర్మరణం చెందారు. ఆ తర్వాత పలు ఎక్స్ ప్రెస్ రైళ్లలో అగ్ని ప్రమాదాలు జరిగాయి. సిబ్బంది అప్రమత్తతో ఆ ప్రమాదాలను వెంటనే నివారించారు.
తాజాగా మంచిర్యాల జిల్లాలో మరో పెనుప్రమాదం తప్పింది. భారీ ఈదురుగాలులకు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగి పట్టాల మీద పడ్డాయి. ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది రైళ్లరాకపోకలను నిలిపివేయడంతో పెనుప్రమాదం తప్పింది. లేదంటే.. ఎంతమంది ప్రాణాలు పోయేవో ఊహకు కూడా అందేది కాదు. సుమారు రెండు గంటలపాటు కోర్భా, రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్లు స్టేషన్లలోనే నిలిచిపోయాయి. మంచిర్యాల - కాగజ్ నగర్ మధ్య రైళ్లరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బెల్లంపల్లి - మందమర్రి రైల్వేస్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. తెగిపడిన హైటెన్షన్ వైర్లను తొలగించడంతో రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి.
Next Story