Wed Jan 15 2025 20:45:39 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఎంసెట్ పేరు మార్పు... ఉమ్మడి పరీక్ష తేదీల ఖరారు
తెలంగాణలో ఉమ్మడి పరీక్షలకు తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది
తెలంగాణలో ఉమ్మడి పరీక్షలకు తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఎంసెట్ ను eapset గా మార్చారు. పీసెట్, లాసెట్ పరీక్షలకు తేదీలను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మే 9 13 వరకూ eapset పరీక్షలు జరుగుతున్నాయి. మే 23న ఎడ్సెట్, జూన్ 3వ తేదీన పీజీ లాసెట్, మే 6న ఈసెట్, జూన్ 4,5 తేదీల్లో ఐసెట్ పరీక్షలు జరుగుతాయి.
ఈ తేదీలలోనే...
ఈ మేరకు ఉన్నత విద్యామండలి తేదీలను ప్రకటించింది. ఈ తేదీల్లోనే ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఈ తేదీలకు ఆమోద ముద్ర వేయడంతో నేడు అధికారికంగా ఉన్నత విద్యామండలి ప్రకటించింది. విద్యార్థులందరూ ఈ మేరకు అర్హత పరీక్షలకు రాసేందుకు సిద్ధమవ్వాలని కోరింది.
Next Story