Sun Dec 22 2024 17:15:26 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా
తెలంగాణలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. భూపాలపల్లి జిల్లాలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా నిర్ధారణ అయింది
తెలంగాణలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. భూపాలజిల్లాలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు ధృవీకరించారు. వీరిలో ఒకరిని వరంగల్ లోని ఏజీఎం ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు. మిగిలిన నలుగురు హోం క్వారంటైన్ లోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
హోం ఐసొలేషన్ లో...
ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఆ కుటుంబంలోని సభ్యులను గత వారం రోజులుగా కలసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా మాస్క్ లు ధరించి భౌతిక దూరం పాటించాలని అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా యాభై పాజిటివ్ కేసులు నమోదు కావడం కొంత ఆందోళనకు గురి చేస్తుంది.
Next Story