Fri Dec 20 2024 12:27:58 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ ను కలిసిన నందమూరి బాలకృష్ణ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కలిశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కలిశారు. మర్యాదపూర్వకంగానే బాలకృష్ణ రేవంత్ రెడ్డిని కలిశారని ముఖ్యమంత్రి కార్యాలయవర్గాలు వెల్లడించాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలను చేపట్టిన తర్వాత బాలకృష్ణ ఆయనను కలవలేదు. సినిమా షూటింగ్ లు తర్వాత ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బాలకృష్ణ ఆయనను కలవలేకపోయారు.
మర్యాదపూర్వకంగానే...
అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బాలకృష్ణ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. ఏపీ రాజకీయాలపైన వారిద్దరూ కొద్దిసేపు చర్చించుకున్నారని తెలిసింది. దీంతో పాటు సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలు కూడా వీరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.
Next Story