Mon Dec 23 2024 03:10:12 GMT+0000 (Coordinated Universal Time)
నయా ట్రెండ్.. హైదరాబాద్ లో డ్రైవ్ ఇన్ థియేటర్
డ్రైవ్ ఇన్ థియేటర్ కోసం నగరం మధ్యలో స్థలం కావాలంటే కష్టమైన పనే. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గర్లో స్థలం కోసం..
కంప్యూటర్ యుగంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త ఆలోచనలతో.. నయా ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. హైదరాబాద్ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చూస్తున్నాం. నిన్న మొన్నటి వరకూ సినిమాలు చూడాలంటే థియేటర్లకు వెళ్లాల్సి ఉండేది. కరోనా రాకతో పలు ఓటీటీ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ఇంట్లో కూర్చునే సినిమాలు చూడొచ్చు. హెచ్ఎండీఏ సంస్థ మరింత కొత్తగా ఆలోచించి.. డ్రైవ్ ఇన్ థియేటర్లను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నాయి. ప్రజల సౌకర్యార్థం నగరంలో డ్రైవ్ ఇన్ థియేటర్స్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
డ్రైవ్ ఇన్ థియేటర్ కోసం నగరం మధ్యలో స్థలం కావాలంటే కష్టమైన పనే. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గర్లో స్థలం కోసం అన్వేషిస్తోంది హెచ్ఎండీఏ. ఇంతకీ డ్రైవ్ ఇన్ థియేటర్స్ అంటే ఏంటో చెప్పలేదు కదూ. ఎవరి కార్లో వారే కూర్చొని వారే సినిమాలు చూడొచ్చు. మనదేశంలోని ప్రముఖ నగరాల్లో ఇలాంటి థియేటర్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ శివార్లలో ఇలాంటి థియేటర్ ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.5 నుంచి రూ.8 కోట్ల వరకూ ఖర్చవుతుందట.
Next Story