Mon Jan 13 2025 23:08:48 GMT+0000 (Coordinated Universal Time)
రాజకీయ నేత దాష్టీకం... అవిటివాళ్లయిన చిన్నారులు
హైదరాబాద్ లోని నిజాంపేట్ లో దారుణం చోటు చేసుకుంది.
హైదరాబాద్ లోని నిజాంపేట్ లో దారుణం చోటు చేసుకుంది. చిన్న పిల్లల చేత ఫ్లెక్సీలను తొలగించబోతే వారు అవిటి వాళ్లుగా మారిపోయిన సంఘటన వెలుగు చూసింది. నిజాంపేట్ పరిధిలోని ఒక నేత బర్త్ డే వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు కట్టారు. పుట్టినరోజు వేడుకలు పూర్తి కావడంతో ఆ ఫ్లెక్సీలను తొలగించాలని ఒక మహిళా నేత అక్కడే ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను పిలిచింది. తన ఇంటిపై ఆ ఫ్లెక్సీని వేయాలని పురమాయించింది.
ఆసుపత్రికి తరలించగా....
ఆ చిన్నారులిద్దరూ ససేమిరా అన్నా బలవంతంగా వారిని ఇంటిపైకి ఎక్కించింది. ఇంటిపైకి ఎక్కిన ఇద్దరు చిన్నారులకు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో వారిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే అందులో ఒకరికి రెండు చేతులో తీసేయాలని వైద్యులు చెప్పారు. మరో చిన్నారికి పాదాలు దెబ్బతిన్నాయని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story