Mon Dec 23 2024 11:57:17 GMT+0000 (Coordinated Universal Time)
అమానుషం .. ప్రసవానికి వచ్చిన గర్భిణీపై అత్యాచారయత్నం
సభ్య సమాజం తలదించుకునేలా.. సిగ్గుపడేలా భద్రాచలంలో జరిగిందీ ఘటన. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చిన..
భద్రాచలం : వావి వరసలు, చిన్నా-పెద్దా తేడా లేకుండా ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరగడం చూస్తున్నాం. నెలల వయసు ఉన్న ఆడపిల్లల నుంచి.. పెళ్లైన మహిళల వరకూ ఎవ్వరినీ వదలడం లేదు మృగాళ్లు. తమ కామవాంఛను తీర్చుకునేందుకు.. ఎవరి కనిపిస్తే వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా భద్రాచలంలో అమానవీయ ఘటన వెలుగుచూసింది.
ఓ నిండు గర్భిణీపై అత్యాచారయత్నం జరిగింది. సభ్య సమాజం తలదించుకునేలా.. సిగ్గుపడేలా భద్రాచలంలో జరిగిందీ ఘటన. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణీకి ఎంఎన్ఓ లాల్ ఖాన్ మత్తుమందు ఇచ్చి, ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ఇంతలో అటువైపుగా వెళ్లిన మరో ఉద్యోగి లాల్ ఖాన్ ను అడ్డుకుని, అతనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేశాడు. ఆస్పత్రి సూపరింటెండెంట్ లాల్ ఖాన్ కు మెమో జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Next Story