Sat Nov 23 2024 00:15:37 GMT+0000 (Coordinated Universal Time)
రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ పై ఎందుకంత కక్ష ? : కవిత
బీఆర్ఎస్ సర్కార్ ఇస్తున్న ఉచిత కరెంట్కు ఉరి వేస్తారా? అంటూ మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్..
తెలంగాణలో వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. రెండోరోజూ రాష్ట్రంలో బీఆర్ఎస్ నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉచిత విద్యుత్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్రం అట్టడుకుతుంది. తెలంగాణ రైతాంగం పై ఎందుకంత అక్కసు వెళ్ళగకుతున్నారని, ఎందుకు కక్ష కట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
బీఆర్ఎస్ సర్కార్ ఇస్తున్న ఉచిత కరెంట్కు ఉరి వేస్తారా? అంటూ మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు ఆందోళనలు చేపట్టారు. ఊరూరా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. రేవంత్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ విద్యుత్ సౌధ వద్ద నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
తెలంగాణలో రైతులకు అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తును రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ ను సరఫరా చేస్తే కాంగ్రెస్ కు వచ్చిన సమస్య ఏమిటని ప్రశ్నించారు. "రాహుల్ గాంధీ గారు.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు అందించలేక పోతున్నారన్న కారణంతో తెలంగాణ రైతాంగాన్ని కూడా మీరు ఇబ్బందులపాలు చేయాలనుకుంటున్నారా ??" అని ట్విట్టర్ వేదికగా అడిగారు. బీఆర్ఎస్ పార్టీ రైతుల ప్రయోజనాలను కాపాడుతుందని, ప్రతి రైతుకు తాము అండగా నిలబడుతామని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Next Story