Mon Dec 23 2024 12:47:23 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ కు వచ్చే ఓట్లపైనే బెట్టింగ్ లు?
మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ కు ఎన్ని ఓట్లు వస్తాయన్నదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది
మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ కు ఎన్ని ఓట్లు వస్తాయన్నదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. 93.3 శాతం పోలింగ్ నమోదు కావడంతో ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అన్న చర్చ జోరుగా సాగుతుంది. భారీగా బెట్టింగ్ లు కూడా జరుగుతున్నాయి. సర్వేలన్నీ టీఆర్ఎస్ వైపు ఉన్నాయి. టీఆర్ఎస్ పది నుంచి పదిహేను వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందుతాయని దాదాపు అన్ని సర్వేలు చెబుతున్నాయి.
టీఆర్ఎస్ మెజారిటీ...
అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి ఎన్ని ఓట్లు వస్తాయన్న దానిపైనే ఎక్కువ బెట్టింగ్ లు జరుగుతున్నాయి. 30 వేల ఓట్లు దాటవని పెద్దయెత్తున బెట్టింగ్ లు కడుతున్నారు. అలాగే టీఆర్ఎస్ మెజారిటీ మీద కూడా భారీగానే బెట్టింగ్ లు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ కు 15 వేల మెజారిటీ దాటుతుందని కొందరు, దాటదని కొందరు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో బెట్టింగ్ లు కడుతున్నారు.
Next Story