Fri Dec 20 2024 07:57:45 GMT+0000 (Coordinated Universal Time)
ఖమ్మంలో బీఆర్ఎస్ సభ నేడు
భారత రాష్ట్ర సమితి భారీ బహిరంగ సభ నేడు ఖమ్మంలో జరగనుంది. ఈ సభకు నలుగురు ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
భారత రాష్ట్ర సమితి భారీ బహిరంగ సభ నేడు ఖమ్మంలో జరగనుంది. ఈ సభకు నలుగురు ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. వంద ఎకరాల్లో సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఐదు లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా, తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రజలు హాజరు కానున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 400 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
జాతీయ రాజకీయాల్లో...
జాతీయ రాజకీయాల్లో ఈ సభ మలుపు తిప్పుతుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఢిల్లీ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవంత్ మాన్ లు ఈ సభకు హాజరు కానున్నారు. వీరితో పాటు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో పాటు సీపీఐ నేత డి రాజా కూడా హాజరు కానున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా దేశంలో తృతీయ కూటమిని ఏర్పాటు కోసం ఈ సభ ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.
Next Story