Sat Nov 23 2024 05:18:36 GMT+0000 (Coordinated Universal Time)
ఈ రోజు దుష్ట శక్తులదే పైచేయి కావచ్చు, కానీ అంతిమ విజయం మంచికే : కేసీఆర్
తెలంగాణ అన్ని మతాల వారిని సమానంగా ఆదరిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దేశంలో అవాంతరాలను
హైదరాబాద్ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు కేసీఆర్ హాజరయ్యారు. ఇఫ్తార్ విందులో కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రానికి రోగం వచ్చింది. చికిత్స చేయాలని అన్నారు. కేంద్రం, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుందని తెలిపారీ. కూల్చివేతలు చాలా సులువని.. దేశాన్ని నిర్మించడమే కష్టమని అన్నారు. మానవాళి పురోగమనానికి, దేశాభివృద్ధికి శాంతి సామరస్యాలు అవసరమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలిపారు.
తెలంగాణ అన్ని మతాల వారిని సమానంగా ఆదరిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దేశంలో అవాంతరాలను పరిష్కరించడం మన బాధ్యత అని ఆయన అన్నారు. దేనినైనా నాశనం చేయడం చాలా సులభం, కానీ నిర్మించడం లేదా అభివృద్ధి చేయడం చాలా కష్టమని అన్నారు. ఈ రోజు దుష్ట శక్తులదే పైచేయి కావచ్చు, కానీ అంతిమ విజయం మంచికే అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని అడ్డంకులను అధిగమించి ఎవరి ఊహకు అందనంతగా పురోగమిస్తోందన్నారు. దేశం మొత్తం అంధకారంలో మగ్గుతుండగా, తెలంగాణ ప్రజలకు మాత్రం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతోందని కేసీఆర్ అన్నారు.
రాష్ట్ర ప్రగతి ద్వారా వచ్చిన ఆదాయాన్ని మైనారిటీలతో సహా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. మేము మైనారిటీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్యను అందిస్తున్నామని తెలిపారు. మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, మత పెద్దలు ఇఫ్తార్ విందులో లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చిన్నారులకు రంజాన్ తోఫాలు అందజేశారు.
Next Story