Mon Dec 23 2024 10:00:16 GMT+0000 (Coordinated Universal Time)
సవాల్ స్వీకరించిన పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నేతలు విసిరిన సవాల్ ను స్వీకరించారు.
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నేతలు విసిరిన సవాల్ ను స్వీకరించారు. ఈరోజు హనుమాన్ టెంపుల్ వద్దకు వస్తున్నట్లు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రకటించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మీద 100 కోట్ల రూపాయల ఫ్లై యాష్ స్కాం ఆరోపణలు చేశారు. ప్రచారం కోసమే పొన్నం మీద ఆరోపణలు చేస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి రైస్ మిల్లర్ల నుండి, ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేశారని, తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని ఆరోపించారు.
హనుమాన్ టెంపుల్ వద్దకు...
మంగళవారం ఉదయం చేల్పూర్ హనుమాన్ టెంపుల్ వద్దకు వస్తే ఆధారాలతో నిరూపిస్తామని సవాల్ విసిరారు. ఈ సవాల్ ను హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జి వొడితెల ప్రణవ్ విసిరారు. దీనిపై స్పందించిన పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ప్రజలకు నా నిజాయితీ నిరూపించుకోవడానికి హనుమాన్ టెంపుల్ వద్దకు వస్తున్నానని అన్నారు. దీంతో అక్కడ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story