Fri Dec 20 2024 09:03:20 GMT+0000 (Coordinated Universal Time)
పెట్రోల్ బంక్ లో నయా మోసం.. డీజిల్ స్థానంలో నీళ్లు..
ఓ వ్యక్తి పెట్రోల్ బంక్ కి వెళ్లి తనకు కావలసిన క్వాంటిటీలో డీజిల్ కొట్టమని చెప్పాడు. మామూలుగా పెట్రోల్, లేదా డీజిల్..
విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంక్ లో మామూలుగానే మోసాలు జరుగుతుంటాయి. కస్టమర్ ఇచ్చిన డబ్బుల కంటే ఎంతో కొంత తక్కువ పెట్రోల్ లేదా డీజిల్ వాహనంలో పంప్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిందే కానీ.. తాజాగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో జరిగింది అంతకుమించి అన్నట్టుగా ఉంది. ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనంలో డీజిల్ కొట్టమని డబ్బులివ్వగా ఏకంగా నీళ్లు కొట్టేశారు. వివరాల్లోకి వెళ్తే..
ఓ వ్యక్తి పెట్రోల్ బంక్ కి వెళ్లి తనకు కావలసిన క్వాంటిటీలో డీజిల్ కొట్టమని చెప్పాడు. మామూలుగా పెట్రోల్, లేదా డీజిల్ వాహనంలోకి పంప్ చేసేటపుడు వాటి వాసన, పొగ వస్తుంటాయి. కానీ ఇక్కడ అతనికి అవేం తెలియలేదు. అనుమానమొచ్చి ఒక బాటిల్ లోకి డీజిల్ కొట్టమని అడిగాడు. అలాంటివి కుదరవని సిబ్బంది చెప్పగా.. కాస్త గట్టిగా అడిగాడు. దాంతో సిబ్బంది బాటిలోకి డీజిల్ పేరుతో నీళ్లను పోశారు. ఇది డీజిల్ కాదు.. నీళ్లు అని అడిగితే.. అక్కడి సిబ్బంది అది డీజిలేనని బుకాయించారు. అదేమంటే.. డీజిల్ రంగు మారిందే తప్ప క్వాలిటీ మారలేదని, ఇప్పటికి 70 బళ్లకు ఇదే డీజిల్ కొట్టానని చెప్పడంతో.. కస్టమర్ షాకయ్యాడు. వెంటనే అతను ఆ బాటిల్ ను పోలీసులకు చూపించి అక్కడ జరుగుతున్న మోసాన్ని బట్టబయలు చేశాడు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగి.. ఆ పెట్రోల్ బంక్ వ్యవహారంపై విచారిస్తున్నారు.
Next Story