Mon Dec 23 2024 06:09:17 GMT+0000 (Coordinated Universal Time)
Asaduddin Owaisi : పదిహేను నిమిషాలు కాదు.. గంట సమయం తీసుకోండి రండి.. ఎక్కడికైనా
ఎంపీ నవనీత్ కౌర్ అన్న వ్యాఖ్యలకు ని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు
మీకు పదిహేను నిమిషాలు కావాలేమో కానీ.. మాకు పది హేను సెకన్లు చాలు అన్న ఎంపీ నవనీత్ కౌర్ అన్న వ్యాఖ్యలకు ని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. తమను ఎక్కడికి రమ్మన్నా వస్తామని అన్నారు. పదిహేను సెకన్లు ఎందుకు గంట సమయం తీసుకోండి అని, అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నది మీరు అని అన్నారు.
అసద్ సవాల్...
అధికారంలో ఉన్న మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తామని గంట సమయం తీసుకుని ముస్లింలను అంతమొందించండి అంటూ అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంత పరిపాలనలో ఉన్నామో అందరికీ ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుందన్నారు. తన సవాల్ ను తీసుకుని ముందుకు రావాలన్నారు.
Next Story