Mon Dec 23 2024 07:51:42 GMT+0000 (Coordinated Universal Time)
Padi Kaushik Reddy: వారందరిపై కేసు నమోదు చేసిన పోలీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంపై దాడికి సంబంధించి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంపై దాడికి సంబంధించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో అరికపూడి గాంధీతో పాటు 18 మంది పైన కేసులు నమోదు చేశారు. 19 మందిని పోలీసులు అరెస్ట్ చేసి సంబంధిత నోటీసులు ఇచ్చి వ్యక్తిగత పూచీకత్తు మీద వదిలిపెట్టారు.
కౌశిక్ రెడ్డి నివాసంపై దాడి పై ఫిర్యాదు చేసేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు సైబరాబాద్ సీపీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సమయంలో కౌశిక్ రెడ్డికి, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ పోలీసు అధికారితో కౌశిక్ రెడ్డి తీవ్ర వాగ్వాదం జరుపుతుండగా హరీశ్ రావు ఆయనకు సర్దిచెప్పి సీపీ కార్యాలయంలోకి తీసుకువెళ్లారు. కౌశిక్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి సీపీ కార్యాలయానికి వెళ్లారు. సీపీ కార్యాలయం వద్ద మెట్లపై బైఠాయించి బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని హరీశ్ రావు తెలిపారు. దగ్గరుండి దాడిని ప్రోత్సహించిన సీఐ, ఏసీపీలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Next Story