Mon Dec 23 2024 04:58:25 GMT+0000 (Coordinated Universal Time)
ఈ ఏడాది చేపమందు పంపిణీ జరిగేది అప్పుడే..
తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచీ కూడా ఆస్తమా బాధితులు భారీగా వస్తారు.
హైదరాబాద్ లో బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప మందు కార్యక్రమం ఎంతో ప్రసిద్ధి చెందింది. 175 ఏళ్లుగా సాంప్రదాయబద్ధంగా బత్తిని కుటుంబం పంపిణీ చేస్తున్న చేపమందు ప్రసాదం కోసం.. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచీ కూడా ఆస్తమా బాధితులు భారీగా వస్తారు. అయితే మూడేళ్లుగా.. కరోనా కారణంగా చేపమంది ప్రసాదం పంపిణీ తాత్కాలికంగా ఆగిపోయింది. ఈ సంవత్సరం చేపమందు పంపిణీకి అనుమతి లభించింది. దీంతో చేపమందు పంపిణీపై బత్తిని సోదరులు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోనే చేపమందు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
అయితే ఈ చేపమందు పంపిణీపై ఎన్నో వివాదాలున్నాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా ఉబ్బసం వ్యాధిగ్రస్తులు ఈ మందుకోసం వస్తారు. బత్తిన సోదరులు అందించే చేప మందు కోసం జనాలు తెల్లవారుజామునుండే కిలోమీటర్ల మేర బారులు తీరుతారు. చేప మందులో శాస్త్రీయత లేదని కోర్టులకు వెళ్ళినా సరే చేప మందు ప్రతి ఏటా పంపిణీ చేస్తూనే వచ్చారు. జూన్ 10వ తేదీ ఉదయం 8 గంటలకు (మృగశిర కార్తె ప్రవేశించగానే) చేపమందు పంపిణీ ప్రారంభం కానుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో రోజు 24 గంటల పాటు చేపమందు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది.
Next Story