Mon Apr 14 2025 04:07:58 GMT+0000 (Coordinated Universal Time)
సీవీ ఆనంద్ కు ఒవైసీ సూటి ప్రశ్న
నగర పోలీస్ కమిషన్ సీవీ ఆనంద్ పై హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు

నగర పోలీస్ కమిషన్ సీవీ ఆనంద్ పై హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో ఈరోజు పెట్రోలు బంకులు ఎందుకు మూసివేయించారని ప్రశ్నించారు. మీరు కూాడా నిజాం కళాశాలలో చదువుకున్నారని, తాను కూడా నిజాం కళాశాలలోనే చదువుకున్నానన్న విషయాన్ని గుర్తు చేశారు.
ఇతర పండగలకు...
ఇతర పండగలకు పెట్రోలు బంకులు బంద్ చేయని మీరు మా పండగలకే ఎందుకు బంద్ చేయిస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాల వల్ల ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నిలదీశారు. మిలాద్ నబీ పండగ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోలు బంకులను బంద్ చేయించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
Next Story