Wed Dec 25 2024 13:00:29 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఇక వానలే వానలట.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది
తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురస్తాయని తెలిపింది. భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో వానలుపడే సూచనలున్నాయని పేర్కొంది.
నేడు,రేపు,
ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు కూడా వీస్తాయని చెపపింది.
మంగళవారం...
మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన 24గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలతో పాటు ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, సంగారెడ్డి, హైదరాబాద్ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.
Next Story