Mon Dec 23 2024 09:43:14 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ షర్మిల అరెస్ట్
రాష్ట్రంలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ.. నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం దుర్మార్గమని వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని నాంపల్లి టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఆమె ధర్నాకు దిగారు. వైఎస్ షర్మిల ఆందోళనకు మద్దతుగా వచ్చిన వైతెపా నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.
రాష్ట్రంలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ.. నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం దుర్మార్గమని వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ బి జనార్దన్ రెడ్డికి వైఎస్ఆర్ సీపీ అధినేత్రి వైయస్ షర్మిల వినతి పత్రం అందజేశారు. టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద షర్మిల ఆందోళనతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి, వైఎస్ షర్మిలతో పాటు పార్టీ నాయకులు అరెస్ట్ చేశారు.
Next Story