Thu Apr 03 2025 03:57:13 GMT+0000 (Coordinated Universal Time)
సీవీ ఆనంద్ బదిలీకి రీజన్ ఏంటంటే?
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ను ఎన్నికల విధుల నుంచి కేంద్ర ఎన్నికల కమిషనర్ తప్పించింది

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ను ఎన్నికల విధుల నుంచి కేంద్ర ఎన్నికల కమిషనర్ తప్పించింది. ఆయనతో పాటు అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. ప్రధానంగా సీవీ ఆనంద్ ను తప్పించడం వెనక నగదు రవాణాను నియంత్రించ లేకపోవడమే కారణమని తెలుస్తోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత అక్రమంగా తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకోవడంలో విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి.
నగదును సీజ్...
ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలంగాణలో పర్యటించినప్పుడు ఐఏఎస్,ఐపీఎస్‌లతో సమావేశమయ్యారు. వారు తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం కూడా సీవీ ఆనంద్ పై బదిలీ వేటు వేయడానికి ఒక కారణంగా చెబుతున్నారు. హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో ఎన్నికల కమిషనర్ వీరిని హెచ్చరించారని కూడా తెలిసింది.
హరీశ్ విషయంలో....
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ పనితీరును కూడా నిశితంగా గమనించిన ఎన్నికల కమిషన్ ఆయనపై కూడా బదిలీ వేటు వేసింది. ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ఈ అధికారులపై విపక్షాలు కూడా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. వారి ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం విచారణ జరిపిన తర్వాతనే బదిలీవ వేటు వేశారని చెబుతున్నారు. ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించే అవకాశాలున్నాయని విపక్షాలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో పెద్దయెత్తున బదిలీలు చేసింది.
Next Story