Sun Dec 22 2024 18:52:21 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీ అగ్రనేతలంతా హైదరాబద్ లో మకాం
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కానుంది. త్వరలో సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కానుంది. త్వరలో ఈ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. హెచ్ఐసీసీలోని నోవాటెల్ హోటల్ లో ఈ సమావేశాలు నిర్వహించాలని పార్టీ నేతలు నిర్ణయించారని తెలిసింది. దీనికి సంబంధించి ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. అదే జరిగితే జాతీయ నేతలంతా హైదరాబాద్ లో సమావేశాలకు హాజరవుతారు.
మూడు రోజుల పాటు....
తెలంగాణపై బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మరో ఏడాదిన్నరలో తెలంగాణలో ఎన్నికలు జరుగుతుండటం, ఈసారి రాష్ట్రంలో పాగా వేయాలని భావిస్తుండటంతో తెలంగాణకు స్పెషల్ ప్రయారిటీ బీజేపీ అగ్రనాయకత్వం ఇస్తుంది. అందులో భాగంగా జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాలు మూడు రోజులు పాటు జరుగుతాయి. ఈ సమావేశానికి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు మూడు రోజులు హైదరాబాద్ లోనే ఉన్నారు. ఈ సమావేశం ఏర్పాటుకు సంబంధించి బీజేపీ జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోష్ త్వరలో హైదరాబాద్ రానున్నారని సమాచారం. వచ్చే నెలలో ఈ సమావేశాలు జరిగే అవకాశముంది.
Next Story